Follow us on Facebook

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Advertisement

13, జనవరి 2021, బుధవారం

Hadees-117 ప్రజలను నీ కీడు నుండి రక్షించు. అదే నీ పాలిట 'సదఖా' (మంచిపని) అవుతుంది!!! Prajalanu ni kiḍu nuṇḍi rakṣincu. Ade ni paliṭasadakha' (manchipani) avutundi! || Telugu Lo islam.Ahamed.




హజ్రత్ అబూజర్ర్ జుందుబ్ బిన్ జునాదా (రది అల్లాహు అన్హు) కథనం : 
నేను  దైవప్రవక్త ముహమ్మద్(ﷺ)ను, “దైవప్రవక్తా! అన్నిటికన్నా, ఉత్తమమైన సత్కార్యం ఏది?" అని అడిగాను. 
దానికి  దైవప్రవక్త ముహమ్మద్(ﷺ) “అల్లాహ్ ను విశ్వసించడం, ఇంకా ఆయన మార్గంలో పోరాడటం” అని సమాధానమిచ్చారు.
తిరిగి నేను “ఎలాంటి బానిసకు స్వేచ్ఛ ప్రసాదించడం ఉత్తమం?" అని అడిగాను.
అందుకు దైవప్రవక్త ముహమ్మద్(ﷺ) “తన యజమాని దృష్టిలో అందరికన్నా యోగ్యుడూ, బాగా ఖరీదైనవాడికి స్వేచ్ఛ నొసగటం” అని అన్నారు. 
అప్పుడు నేను “అది నావల్ల కాకపోతే ఏం చేయాలి?” అని అడగ్గా,
అయితే "ఏ పనివాడికైనా సహాయపడు లేకపోతే ఏ పనిరాని వాడికైనా అతని పనిచేసి పెట్టు" అని ... దైవప్రవక్త ముహమ్మద్(ﷺ) అన్నారు. 
“ఓ దైవప్రవక్తా! నేను ఈ మాత్రం పని కూడా చేయలేక పోతేనో?!” అని నేను మళ్ళీ సందేహపడగా, 
అందుకు దైవప్రవక్త ముహమ్మద్(ﷺ) ప్రజలను నీ కీడు నుండి రక్షించు. అదే నీ పాలిట 'సదఖా' (మంచిపని) అవుతుంది" అని అన్నారు. 
(బుఖారీ - ముస్లిం) 

‘సానీ' అన్న పదానికే బహుళప్రచారం ఉంది. అయితే జాయిఅన్ అని కూడా ఉల్లేఖించబడింది. 'జాయీ' అంటే పేదరికం, సంతానభారం వంటి కష్టాలతో బాధపడుతున్నవాడు. 'అఖ్ రఖ్' అంటే తన పని తాను సక్రమంగా చేసుకోలేని వాడు.

సహీహ్ బుఖారీలోని 'బానిస విమోచన' ప్రకరణంలోనూ, సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణంలోనూ ఈ హదీసు ప్రస్తావనకు వచ్చింది.) 

భావం:-

పై హదీసు ద్వారా దైవమార్గంలో పోరాడటం, బానిసలకు విముక్తి నొసగి స్వేచ్చాయుత జీవితాన్ని ప్రసాదించడం లాంటి ఉత్తమ సత్కార్యాల మహత్మ్యం వెల్లడౌతోంది. అదేవిధంగా ఇతరుల పట్ల సానుభూతి, సహకార భావంతో మెలగాలని కూడా ఈ హదీసు చెబుతోంది. అంతేకాదు, మన మాటల వల్లగాని, చేతలవల్ల గాని సాటి మానవులకు బాధకలగకుండా జాగ్రత్తపడటం కూడా ఓ మహత్తర పుణ్యకార్యమేనని అంటోంది. సత్కర్మలు స్వీకృతిని పొందాలంటే దైవంపై విశ్వాసం ఉండటం అవసరం. విశ్వాసానికి ఫలితమే సదాచరణ. కనుక ఆ విశ్వాసమే లేకపోతే దైవసమక్షంలో ఏ సత్కార్యమూ స్వీకృతిని పొందజాలదు.





వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Assalaamualaikum Wa Rahmatullahi Wa Barakatuhu

Featured post

Hadees-105 స్వర్గ నరకాలు మనకి యంత సమీపంలో ఉన్నాయి?!

హజ్రత్ ఇబ్నె మస్ వూద్ (రది) కథనం ప్రకారం దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) ఇలా ప్రబోధించారు :  స్వర్గం మీ పాదుక పట్టీ కన్నా మీకు దగ్గరలో ఉంది ....

Popular Posts